సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై స్పాట్ ఫైన్లు.. వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలకు జియోట్యాగింగ్ చేయాలి
అధికారులకు జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ ఆదేశాలు
హన్మకొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీల పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు.
గురువారం హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్.. జిల్లాలో వ్యర్థాల నిర్వహణ, సేకరణ, ప్రాసెసింగ్‌పై పలు కీలక సూచనలు చేశారు.
జిల్లాలో ఇప్పటివరకు 42 గ్రామ పంచాయతీలను గుర్తించినట్లు జిల్లా పంచాయతీ అధికారి వివరించగా, ఆయా గ్రామ పంచాయతీల్లో నాలుగు బిన్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, హానికర/ప్రత్యేక సంరక్షణ అవసరమైన వ్యర్థాలను మూలస్థాయిలోనే వేరు చేసి సేకరించాలని ఆదేశించారు.
రోజుకు 50 నుంచి 100 కిలోల వరకు వ్యర్థాలు ఉత్పత్తి చేసే బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. వారి వద్దే తడి వ్యర్థాలను కంపోస్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, మిగిలిన పొడి వ్యర్థాలను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు లేదా ఆటో ట్రాలీల ద్వారా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేయాలని సూచించారు.
శానిటరీ, ప్రత్యేక సంరక్షణ అవసరమైన వ్యర్థాలను సమీపంలోని బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఏజెన్సీలకు అప్పగించేలా ఎంఓయూలు చేసుకుని శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై స్పాట్ ఫైన్లు
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు స్పాట్ ఫైన్లు విధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో బర్తన్ బ్యాంకులు ఏర్పాటు చేసి, ఫంక్షన్ హాళ్లలో స్టీల్, ఇతర పునర్వినియోగ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
త్వరలో జరగనున్న గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీలతో ముందస్తు సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఉత్సవాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలకు జియోట్యాగింగ్
ప్రతి గ్రామ పంచాయతీలోని తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను జియోట్యాగింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దేవాలయాల నుంచి వచ్చే కొబ్బరి చిప్పలు, పూల వ్యర్థాలను గుర్తించి వాటితో ఉపయోగకరమైన ఉత్పత్తుల తయారీ వంటి వినూత్న విధానాలను ప్రోత్సహించాలని సూచించారు.
ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో చెత్త పేరుకుపోయే ప్రదేశాలు లేకుండా నిరంతరం పరిశుభ్రతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ, పరకాల మున్సిపాలిటీ పరిధిలోనూ నాలుగు బిన్ల విధానం, ఇంటింటి చెత్త సేకరణ, బల్క్ వేస్ట్ జనరేటర్ల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్ తదితర చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన హన్మకొండ జిల్లాను నిర్మించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్, ఇన్‌చార్జ్ కలెక్టర్ శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి, కాలుష్య నియంత్రణ మండలి అధికారి సునీత, జీడబ్ల్యూఎంసీ, పరకాల మున్సిపాలిటీ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.