🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 14 Aug, 2026 | Page: 1

హైదరాబాద్ నడిబొడ్డున పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ ఎదురుగా సామాజిక సంస్కర్తలు, విద్యా ప్రదాతలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున పూలే దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించడం గర్వకారణమని ఆది శ్రీనివాస్‌ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వారు చూపిన సామాజిక సమానత్వం, విద్య, అభ్యుదయ మార్గంలో ముందుకు సాగుతూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.
🏠 Home