🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 15 Aug, 2026 | Page: 1

వరంగల్ గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని హన్మకొండ, వరంగల్ జిల్లాల బీజేపీ ముఖ్య నేతల కీలక భేటీ.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్‌లలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24, 25వ తేదీలలో 24 గంటల మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య నాయకులు ప్రకటించారు.

వరంగల్ శివనగర్‌లోని గంట రవికుమార్ గారి స్వగృహంలో శనివారం హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య నాయకుల ముఖ్య సమావేశం జరిగింది.

ఈ భేటీలో 66వ డివిజన్లల వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

స్థానిక సమస్యలపై మున్సిపల్ అధికారులు, పాలకులు నిర్లక్ష్య వైఖరిని వీడాలని, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24, 25 తేదీలలో24 గంటల భారీ ఎత్తున ధర్నా నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు.
🏠 Home