🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 15 Aug, 2026 | Page: 1

రేపు పరకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

రేపు పరకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సభా స్థలాన్ని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయ్యూబ్ అలీ
పరకాల, ఆగస్టు 15: హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని పరకాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా స్థలి, సభా వేదికతో పాటు సీఎం పాల్గొనే వివిధ కార్యక్రమాల ప్రదేశాలను హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు అయ్యూబ్ అలీ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన వారు.. అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పరకాల పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయ్యూబ్ అలీ కోరారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home