🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 16 Aug, 2026 | Page: 1

రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిణి K. సురేఖ దుర్మరణం

ములుగు, ఆగస్టు 16, 2026: ములుగు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిణి (DMO) K. సురేఖ దుర్మరణం చెందారు. తాడ్వాయి–పస్రా మధ్య ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సురేఖతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
సురేఖ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి. ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కుమారుడు మృతి చెందగా, ఆరు నెలల క్రితం భర్త కూడా కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి కోలుకోకముందే సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది.
సురేఖ గతంలో మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారిణిగా కూడా విధులు నిర్వహించారు. ఆమె ఆకస్మిక మృతిపట్ల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
🏠 Home