🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 16 Aug, 2026 | Page: 1

భువన సుస్వర మ్యూజిక్ అకాడమీ ‘గానాభిషేకం–సీజన్ 2

హన్మకొండ: భువన సుస్వర మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘గానాభిషేకం–సీజన్ 2’ సంగీత కార్యక్రమం హన్మకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొని తమ సంగీత ప్రదర్శనలతో అలరించారు.
కార్యక్రమానికి భువన సుస్వర మ్యూజిక్ అకాడమీ ప్రధాన కార్యదర్శి చోటు, అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు భువన హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు పాటలు, సంగీత ప్రదర్శనలు అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. సంగీత కళను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన కళాకారులకు వేదిక కల్పించడమే భువన సుస్వర మ్యూజిక్ అకాడమీ లక్ష్యమని తెలిపారు. ‘గానాభిషేకం–సీజన్ 2’ను విజయవంతం చేసిన కళాకారులు, సంగీతాభిమానులు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కళాకారులు, సంగీతాభిమానులు, అకాడమీ సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home