సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్
వరంగల్, ఆగస్టు 16, 2026:
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి *శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి* గారిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *శ్రీ మహమ్మద్ అయూబ్* గారు పరకాల టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం వరంగల్ జిల్లా అభివృద్ధి, విద్యార్థులు, యువత, మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి గారిని కోరినట్లు తెలిపారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మైనార్టీ విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
డిగ్రీ, బీటెక్ పూర్తి చేస్తున్న పలువురు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కళాశాల యాజమాన్యాలకు అందకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా వరంగల్ జిల్లాలో కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు వరంగల్ జిల్లాకు కళాక్షేత్రం కేటాయించాలని కోరుతూ అలాగే పలు అంశాలను సీఎం రేవంత్ గారితో చర్చించాము అని అయూబ్ గారు తెలిపారు…
ప్రజలు, విద్యార్థులు, యువత మరియు మైనార్టీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు పేర్కొన్నారు….