🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 17 Aug, 2026 | Page: 1

నవంబర్‌లో తిరుమల శ్రీవారి దర్శనం, సేవల టికెట్లకు తేదీలు ఖరారు

తిరుమల: నవంబర్‌ 2026 నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి, ప్రత్యేక దర్శనం తదితర టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ తేదీలను టీటీడీ ప్రకటించింది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాల్లో అధికారిక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.
ముఖ్యమైన బుకింగ్‌ తేదీలు : ఆగస్టు 18 నుంచి 20 వరకు – ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌నవంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌ నమోదు ఆగస్టు 18 ఉదయం 10 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 20 ఉదయం 10 గంటలకు ముగుస్తుంది.
ఆగస్టు 21 – ఆర్జిత సేవల టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల బుకింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
పుష్పయాగం : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్‌ 16న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సేవకు సంబంధించిన టికెట్ల బుకింగ్‌ ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
ఆగస్టు 21 మధ్యాహ్నం 3 గంటలకు – ఆన్‌లైన్‌ సేవలు : కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన వర్చువల్‌ సేవలు, సంబంధిత దర్శన కోటా బుకింగ్‌ ప్రారంభమవుతుంది.,ఆగస్టు 24 ఉదయం 10 గంటలకు – అంగప్రదక్షిణం :నవంబర్‌ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల బుకింగ్‌ ప్రారంభమవుతుంది,ఆగస్టు 24 మధ్యాహ్నం 3 గంటలకు – వయోవృద్ధులు, దివ్యాంగుల కోటా, ప్రత్యేక దర్శన కోటా బుకింగ్‌ ప్రారంభమవుతుంది,ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు – రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం,నవంబర్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ ప్రారంభమవుతుంది, ఆగస్టు 25 మధ్యాహ్నం 3 గంటలకు – వసతి కోటా, తిరుమల, తిరుపతిలో నవంబర్‌ నెలకు సంబంధించిన వసతి గదుల కోటా బుకింగ్‌ ప్రారంభమవుతుంది.
ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు – తిరుచానూరు దర్శనం
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించిన సెప్టెంబర్‌ 2026 ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.200 టికెట్ల బుకింగ్‌ ప్రారంభమవుతుంది.
ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు – స్థానిక ఆలయాల సేవలు
సెప్టెంబర్‌ 2026 నెలకు సంబంధించిన టీటీడీ స్థానిక ఆలయాల సేవా కోటా బుకింగ్‌ ప్రారంభమవుతుంది.
ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు – శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం
అలిపిరిలోని సప్తగో ప్రదక్షిణ శాలలో నిర్వహించే సెప్టెంబర్‌ 2026 నెల శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల బుకింగ్‌ ప్రారంభమవుతుంది.
భక్తులు బుకింగ్‌ సమయంలో టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించే నిబంధనలు, సమయాలను తప్పనిసరిగా పరిశీలించాలని టీటీడీ సూచించింది.
🏠 Home