🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 17 Aug, 2026 | Page: 1

40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత పథకంలో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రభుత్వాన్ని హెచ్చరించినారు సోమవారం రోజున వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ పార్టీ 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేసినారు ధర్నా కార్యక్రమంలో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేసినారు మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ నేటి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రచారానికి ఆర్భాటానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నారని నిరుపేదలకు పెన్షన్లు ఇస్తామనే ఆలోచన లేదన్నారు మూడు సంవత్సర ల క్రితం అర్హులైన వితంతు వికలాంగులు ఒంటరి చేనేత గీతా కార్మికులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అప్పటి అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అప్రూవల్ చేసినారని అట్టి దరఖాస్తులను మళ్ళీ అధికారులు దరఖాస్తులు తీసుకోవడం లబ్ధిదారులను ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని విధాల లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు ఆందోళన చేస్తున్న లబ్ధిదారుల వద్దకు కమిషనర్ వెంకన్న గ్రీవెన్స్ సెల్ నుండి బయటకు వచ్చి వినతి పత్రం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రెండో విడత పింఛన్లు మంజూరుకు కృషి చేస్తానని నూతనంగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి సైట్ ఓపెన్ చేయిస్తానన్నారు మట్టవాడ పోలీస్ స్టేషన్ ఎస్సై సాంబయ్య ఆందోళన చేస్తున్న లబ్ధిదారులను శాంతింప చేసి ఆందోళనను విరమింప చేసినారు ఇట్టి ధర్నా కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వనం కుమార్ మరుపళ్ల గౌతం పోలేపాక రాజన్ బాబు అన్న శ్రీనివాస్ ఆవునూరు మల్లేశం మంద బాబు రాయబారపు కిషన్ పినగాని నాగేశ్వరరావు వెంగళ సదానందం కోరె సరోజన కెంచ లక్ష్మి వెంగళ శకుంతల ఆకుతోట విజయ లు పాల్గొన్నారు
🏠 Home