జపాన్ పర్యటనకు ఎంపికైన ఉపాధ్యాయుడు బొమ్మెర కుమారస్వామి* *అభినందనలు తెలిపిన మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
పర్వతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా మరియు ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కొరకు జపాన్ పర్యటనకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులలో పర్వతగిరి మండలం యుపిఎస్ దౌలత్ నగర్ పాఠశాల నుండి ఉపాధ్యాయుడు డాక్టర్ బొమ్మెర కుమారస్వామి ఎంపికవ్వడం అభినందనీయమని పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 05-09-2026 నుండి 12-09-2026 వరకు కొనసాగే ఈ విద్యా పర్యటనలో జపాన్ దేశంలోని విద్యా విధానాలు బోధన పద్ధతులు వినూత్న కార్యక్రమాలను అధ్యయనం చేయడం జరుగునని తెలిపారు. మన రాష్ట్రంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురావాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ అధ్యయనం మరింత తోడ్పడుతుందని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు డాక్టర్ బొమ్మెర కుమారస్వామి కి పర్వతగిరి మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలుపుతూ వారి పర్యటన విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.