🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 17 Aug, 2026 | Page: 1

సాగునీరు లేక ఎండిపోయిన సాగు పంటలు

*సిత్య తండాలో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించి, రైతు రమావత్ భిక్ష తదితరులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
పాలకుర్తి నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సిత్య తండాలో SRSP కాలువ నుండి నీటి విడుదల చేయక ఎండిపోయిన పంట పొలాలను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్న రైతు రమావత్ భిక్ష పొలంలో బోరును, పక్కనే అనుకొని ఉన్న చెక్ డ్యామ్ ను పరిశీలించి సాగు నీరు అందక ఎండిపోయిన నారు మడిని చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి అవేదనకు గురయ్యారు. గత పది ఏండ్ల పాలనలో ఈ సంవత్సరం రైతులకు వచ్చిన దుస్థితి ఎన్నడూ రాలేదని రైతులు రమావత్ భిక్ష, కిషన్ అన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో రైతులను సంతోషంగా ఉన్నామని సంవత్సరంలో మూడు పంటలు పండించే వాళ్లమని ఎర్రబెల్లికి రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సమయానికి రైతు బంధు, ఎరువులు, కరెంట్, సాగు నీరు అందించి మమ్మల్ని కంటికి రెప్పోలే కాపాడుకున్నారని అన్నారు, కానీ ఈ కాంగ్రెస్ రేవంత్ సర్కార్ లో మాత్రం రైతులకు కన్నీరే మిగిలిందని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి నష్టపోతున్న రైతుల గురించి ఆలోచించి SRSP కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలబడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ యం. మనోజ్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు,ఏయంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జీతేందర్ రెడ్డి,ఏయంసీ మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్,మాజీ మండల అధ్యక్షులు రంగు కుమార్ గౌడ్,మాజీ మండల రైతు బంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, మాజీ కో ఆప్షన్ ఎంపీటీసీ ఎండీ షాబీర్ పాషా, సర్పంచులు గుగులోతు భద్రమ్మ వీరన్న, నరేష్, ఎలికట్టే వేణు,మండల సీనియర్ నాయకులు చీమల బిక్షపతి,బొట్ల మధు,మధుకర్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ దొమ్మటిలక్ష్మీనారాయణ,మాజీ సర్పంచ్ బండి సంతోష్,గడ్డి యాకయ్య,నాయకులు దొమ్మటి రాజు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు రైతులు తదితరులు ఉన్నారు...
🏠 Home