ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు, వాదనలను సెప్టెంబర్ 16 లోగా తెలియజేయాలి - జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్
ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు, వాదనలను సెప్టెంబర్ 16 లోగా తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ తెలిపారు . ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని అక్టోబర్ 15లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను అక్టోబర్ 19న ప్రచురించాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్డీవోలు, తహసీల్దార్లతో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందని, ఎవరైనా ఓటర్లు, లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా ఓటరు జాబితా పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 17 నుండి, సెప్టెంబర్ 16 వరకు తెలియజేయవచ్చని చెప్పారు. ఇలా వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్టోబర్ 15 లోగా పరిష్కరించడం జరుగుతుందని, తదనంతరం అక్టోబర్ 19 న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో పేర్లు, లింగం, వయస్సు, చిరునామా, డివిజన్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఈఆర్వో ,ఏఈఆర్వోలు పరిశీలించాలని, మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు.ప్రతి అభ్యంతరానికి సంబంధించి ప్రత్యేకంగా ఫైల్ ఏర్పాటు చేసి, సంబంధిత రికార్డులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. తుది ఓటరు జాబితా పై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, డ్రాప్ లిస్టులోని వివరాలను వారికి అందుబాటులో ఉంచి అభ్యంతరాలు, తప్పులను పరిశీలించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.బీఎల్‌ఏలతో సమావేశాలు నిర్వహించి వారికి తగిన సూచనలు ఇవ్వాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు, భవనాలు, ఫొటోలు తదితర అంశాలను పరిశీలించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ సక్రమంగా జరిగేలా చూడాలని, ఇది వరకే గుర్తించిన ప్రదేశాలలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్ల వివరాలలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి దేవ రాజ్ ,ఆర్డీవోలు, తహసిల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు .