🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 17 Aug, 2026 | Page: 1

భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల PAC సమావేశం.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

నల్లగొండ: ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ PAC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.గతానికి భిన్నంగా జిల్లాల స్థాయిలోనే PAC సమావేశాలు నిర్వహించడం శుభపరిణామమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం యవచ్చని తెలిపారు.పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పార్టీ సర్వేలు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 20న పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని, కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని, యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ.. కొత్త ఓటర్ల నమోదు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాను తెలంగాణలో నెంబర్ వన్‌గా నిలబెట్టేలా పనిచేస్తామని మంత్రి తెలిపారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి, ఆయనను ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.మీనాక్షి నటరాజన్ పర్యటన, PAC సమావేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
🏠 Home