కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగవని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అమలుపై హైకోర్టు స్టే
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగవని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అమలుపై హైకోర్టు స్టేకళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. పథకాలను నిలిపివేయాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లోని న్యాయపరమైన లోపాల వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని మంత్రి ఆరోపించారు. పేదలకు నష్టం కలగకుండా అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటామని చెప్పారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై.. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలో రాజకీయంగాకాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఈ రెండు సంక్షేమ పథకాలను నిలిపివేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తుందని తెలిపారు.
ఈ రెండు పథకాలపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవిస్తుందని మంత్రి వెల్లడించారు. అదే సమయంలో పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత, ప్రజా ప్రయోజనాన్ని వివరిస్తూ సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చిన గడువులోపు కౌంటర్ దాఖలు చేసి.. ఆ తర్వాత డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ చేయనున్నట్లు వెల్లడించారు