🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 18 Aug, 2026 | Page: 1

జర్మనీలో ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ, వసతి..

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దేశ, విదేశాల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా నిరుద్యోగులు, విద్యార్థులకు కల్పిస్తోంది. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్య శిక్షణను ఉచితంగా అందిస్తోంది. తాజాగా జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నారు. అనంతరం వారికి ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు
.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా ఎస్సీ, ఎస్టీ నర్సింగ్‌ పూర్తి చేసినవారికి జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. జర్మనీ జాబ్‌ ఆపర్చునిటీ ప్రోగ్రామ్‌ పేరుతో విశాఖపట్నం, తిరుపతి, గుంటూరుల్లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో నర్సింగ్ పూర్తిచేసిన వారికి జర్మన్‌ భాషలో బీ2 స్థాయి వరకు శిక్షణ అందిస్తారు. అనంతరం వీరికి జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నైపుణ్యాభివృద్ధిశాఖ అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్న జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్‌) చదివిన మహిళలు ఈ శిక్షణకు అర్హులు. కనీసం మూడేళ్లపాటూ ఆసుపత్రిలోని ఐసీయూ, ఓటీ, కార్డియో విభాగాల్లో నర్సులుగా పనిచేసిన అనుభవం ఉండాలి. వీరికి 8 నుంచి 10 నెలల శిక్షణ ఉంటుంది.. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత వసతి కల్పిస్తారు. ఈ శిక్షణకు సంబంధించిన పరీక్ష రుసుం ముందు అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుంది.. ఆ డబ్బుల్ని తర్వాత రిఫండ్‌ చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.2.75 నుంచి రూ.3.30 లక్షల వరకు వేతనం ఇస్తారు.. జర్మనీ వెళ్లేందుకు వీసా, విమాన టికెట్, ఇతర ఖర్చులు ఉద్యోగమిచ్చే సంస్థ చూసుకుంటుంది.

ఈ నెల 31లోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థులు వివరాలు నమోదు చేసే సమయంలో జనన ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలి.. బీఎస్సీ(నర్సింగ్‌), జీఎన్‌ఎం మార్కుల లిస్ట్, మిగిలిన పత్రాలు దరఖాస్తుతో పాటుగా జత చేయాలి. వివాహం, మూడేళ్ల అనుభవం, పదో తరగతి, ఇంటర్‌ మార్కుల లిస్ట్, నర్సింగ్‌ లైసెన్స్‌ డాక్యుమెంట్, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు ఉండాలి. ఒకవేళ పాస్‌పోర్టు లేకపోతే శిక్షణ పూర్తయ్యే లోగా అందజేస్తే సరిపోతుంది.
🏠 Home