పోలీస్ ఉద్యోగాల భర్తీకి 19 నుంచి దరఖాస్తులు
కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నెల 19 నుంచి (రేపటి నుండి) ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపటి నుండి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.అభ్యర్థుల వయోపరిమితిపై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నోటిఫికేషన్లలో మార్పులు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 29 ఏళ్లకు, ఎస్సై పోస్టులకు 32 ఏళ్లకు పెంచింది. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు వర్తించనుంది.ఈ మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం సవరించిన నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు tgprb.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.