🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 18 Aug, 2026 | Page: 1

ఊకల్ నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి రూ1,00,116/-* ల విరాళం అందజేసిన గీసుకొండ గ్రామ శ్రీమంతుడు పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం, ఊకల్ హవేళి గ్రామంలోని సుప్రసిద్ధ, మహిమాన్వితమైన శ్రీనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో మౌళిక సదుపాయాల కల్పన నిమిత్తం, గీసుకొండ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ గారు ఒక లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని, దేవాలయ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వర్ రావు గారికి అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయం ప్రధాన అర్చకులు శ్రీమాన్ సముద్రాల సుదర్శనాచార్యులు, గ్రామ సర్పంచ్ కక్కెర్ల సుభాష్, ఎన్పిడిసియల్ డిడి మల్లికార్జున్, గీసుకొండ వాస్తవ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, నేతాజీ సర్వీస్ టీం వ్యవస్థాపకుడు మొగసాని శంకర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home