నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా - రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతా
రూ.23.85 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్గొండ పట్టణంలో సిసి రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, తాగునీరు, విద్యుత్, పార్కులు ఇలా అన్ని సదుపాయాలను కల్పించి సమస్యలు లేని పట్టణంగా, తెలంగాణలోనే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
మంగళవారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లో 23 కోట్ల 85 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు.
ముందుగా మంత్రి 3 వ డివిజన్లో షెడ్యూల్ తెగల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీ నుండి శేషమ్మ గూడెం మీదుగా, అద్దంకి రహదారి వరకు 9 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఆ తర్వాత పానగల్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నుండి డీఈఓ కార్యాలయం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర వన్ టైం ఇంప్రూవ్మెంట్ కింద 14.45 కోట్ల రూపాయల తో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆయా డివిజన్ లలో మాట్లాడుతూ నల్గొండ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, పట్టణానికి బయట 900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డును చేపట్టడం జరిగిందని, పట్టణంలో 500 కోట్లతో చేపట్టిన సిసి రహదారులు, డ్రైన్ల పనులు పురోగతిలో ఉన్నాయని, మారుమూల శివారు ప్రాంతాలను కలుపుకొని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. పట్టణంలో రహదారుల ఏర్పాటుతోపాటు, సైడ్ డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్ ,విద్యుత్, త్రాగునీటి సౌకర్యాలని కల్పిస్తున్నామని, పట్టణానికి 24 గంటలు తాగునీరు అందించేలా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 83 కోట్ల రూపాయలతో వాటర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయగా, నెల రోజుల్లో ఆ వాటర్ ప్లాంట్ ద్వారా తాగునీరు అందించే పనులు శరవేగంగా నడుస్తున్నాయని, పట్టణానికి తాగినీటి కై ముఖ్యమంత్రిని ఒప్పించి మరో 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇదివరకే పట్టణంలో 125 కోట్ల రూపాయలతో 12 తాగునీటి ట్యాంకులు చేపట్టగా, అందులో ఒకటి పూర్తి అయిందని, డిసెంబర్ నాటికి తక్కిన 11 వాటర్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తయితాయని వెల్లడించారు.పట్టణంలో విద్యుత్ సమస్య లేకుండా ప్రధాన కాలనీలతో పాటు, శివారు గ్రామాలలో కూడా ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలు వెచ్చించి సబ్ స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, అవసరమున్న చోట స్మశాన వాటికలు, దేవాలయాలు,చర్చిలు మసీదులను కట్టిస్తున్నామని, పట్టణానికి మొదటి విడత 700 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని, అవసరమైతే మరిన్ని ఇండ్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ నెల 15న గొల్లగూడ సమీపంలో నిర్మించిన 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిష్పక్షపాతంగా, పార్టీలకతీతంగా లబ్ధిదారులకు అందించామని, నల్గొండ ను సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. పట్టణంలో లతీఫ్ సాబ్ గుట్ట, శివాలయం గుట్టలకు 150 కోట్ల రూపాయలతో రహదారులను మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయని, అంతేకాక రోప్ వే కూడా ఏర్పాటు చేస్తున్నామని, పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన ఛాయా సోమేశ్వర దేవాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 150 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించామని, పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీ సమస్యలు తీరుస్తామని, పట్టణానికి నడిబొడ్డున ఉన్న నాగార్జున కళాశాల బ్లాక్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, తెలంగాణలోనే మొదటి కళాశాల గా పేరుపొందిన ఎన్జీ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు, మహిళా స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి చేసేందుకు ఇటీవలే 3 కోట్ల రూపాయలతో పెట్రోల్ పంపును ప్రారంభించామని, 2 కోట్ల రూపాయలతో సూపర్ మార్కెట్ నిర్మిస్తున్నామని, అంతేకాక మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా గోదాముల నిర్వహణ, రైస్ మిల్లుల ఏర్పాటు వంటివి చేయిస్తున్నామని, సంఘంలో లేని మహిళలు కొత్త సంఘాలుగా ఏర్పాటు కావాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన వల్ల పట్టణం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని అన్నారు.
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలకతీతంగా నల్గొండ కార్పొరేషన్ ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని, పట్టణంలో రహదారుల ఏర్పాటుతో పాటు, డివైడర్లు ,సెంట్రల్ లైటింగ్, హైమాస్ లైటింగ్, సుందరీకరణ వల్ల పట్టణానికి మరింత శోభను తీసుకొస్తుందని అన్నారు.
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, కార్పొరేటర్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, కార్పొరేటర్లు యమ కవిత, కేసాని వేణు గోపాల్ రెడ్డి, మల్లీశ్వరి తదితరులు మాట్లాడారు.
డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మున్సిపల్ కమిషనర్ వంశీ, ఆర్ అండ్ బి ఎస్ ఈ పున్నమోహన్, ఈ ఈ శ్రీధర్ రెడ్డి, డి ఈ గణేష్, ఆర్ డి ఓ అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరీ రమేష్, తహసిల్దార్ పరశురాం, మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి, డిటిడిఓ, ఏసీఎస్ డైరెక్టర్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కార్పొరేటర్లు స్వాతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్,3వ వార్డు ఇంచార్జ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, జాతీయ రహదారి అధికారులు, తదితరులు ఉన్నారు.