🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 19 Aug, 2026 | Page: 1

శ్రీ నందన్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు అయూబ్

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చార్బౌలి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ నందన్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ తాటి శిరీషా–ప్రశాంత్ దంపతులకు జిల్లా అధ్యక్షుడు అయూబ్ గారు శుభాకాంక్షలు తెలియజేసి, ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు…

అనంతరం హాస్పిటల్ యాజమాన్యం శ్రీ మహమ్మద్ అయూబ్ గారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం శ్రీ మహమ్మద్ అయూబ్ గారు మాట్లాడుతూ, చార్బౌలి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో శ్రీ నందన్ హాస్పిటల్ ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….
🏠 Home