దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గంలోని 65వ డివిజన్ పరిధిలోని కోమటిపల్లి గ్రామం మధుర నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ కూర్మచల అష్టలక్ష్మి సమేత నవనారసింహ వారాహి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, అర్చకులు శ్రీమాన్ సేవాపతి రంగాచార్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణం, అభివృద్ధికి తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని అనుసరిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించిన ఆలయ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ దేవస్థానం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ సునీల్, హసన్‌పర్తి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ లావుడ్య తిరుపతి, ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు, డివిజన్ నాయకులు కుమార్, లింగు, విజయ్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు రమణ, హరీష్, కిషోర్, విజయ్, తిరుపతి, కుమార్, రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.