పల్లె పల్లెకు... పొన్నం అన్న.. ప్రజాపాలనలో ప్రజలతో ముఖాముఖి
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
హుస్నాబాద్ నియోజకవర్గంలో “పల్లె పల్లెకు... పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజాపాలన” కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు.
గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి పనులపై మంత్రి వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే రైతులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రజలు నేరుగా తమ సమస్యలను మంత్రికి వివరించేలా ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామస్థుల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచిస్తున్నారు.
ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడడం, గ్రామీణ ప్రాంతాల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా కొనసాగుతోంది.