అంగన్వాడీలకు భారీ శుభవార్త.. సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ రెట్టింపు
హైదరాబాద్: తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ సమయంలో అందించే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది.కొత్త నిర్ణయం ప్రకారం అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, అంగన్వాడీ హెల్పర్లకు రూ.1 లక్ష సర్వీస్ ఎండ్ బెనిఫిట్‌గా అందించనున్నారు.65 ఏళ్ల వయస్సు పూర్తై పదవీ విరమణ చేసే సిబ్బందికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అలాగే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అంగన్వాడీ సిబ్బంది స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా ఈ ప్రయోజనం పొందే అవకాశం కల్పించారు.
గతంలో అంగన్వాడీ టీచర్లకు రూ.1 లక్ష, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేలుగా ఉన్న సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం తాజాగా పెంచింది.
ఇప్పటివరకు రూ.15.61 కోట్లు జమ
2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,572 మంది అంగన్వాడీ సిబ్బందికి రూ.15.61 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 473 మంది టీచర్లకు రూ.4.73 కోట్లు, 1,930 మంది హెల్పర్లకు రూ.9.65 కోట్లు చెల్లించినట్లు తెలిపింది.
అంగన్వాడీ సిబ్బంది దీర్ఘకాలంగా అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే అంశంగా మారింది. పదవీ విరమణ సమయంలో అందే ప్రయోజనం పెరగడంతో అంగన్వాడీ ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.