🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 20 Aug, 2026 | Page: 1

హన్మకొండలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలు

• డీసీసీ భవన్, ఎంజీఎం సెంటర్‌లలో నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు.
• ఆధునిక భారత సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ గారే ఆద్యుడు: డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.

భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలను హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నేతృత్వంలో హన్మకొండలోని డీసీసీ కార్యాలయం మరియు ఎంజీఎం సెంటర్ లలో ఈ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా డీసీసీ భవన్‌లో ఆయన చిత్రపటానికి, ఎంజీఎం సెంటర్ లోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయ్యూబ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు, టీపీసీసి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, వరంగల్ మార్కెట్ ఛైర్మన్ పులి ప్రియాంక, IYC జాతీయ కార్యదర్శి శ్రీమతి సాగరిక రావు గారు , చైర్మన్లు అజీజ్ ఖాన్, టీపీసీసి జనరల్ సెక్రేటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు తదితరులు కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశ నిర్మాణానికి, దేశంలో నేడు మనం చూస్తున్న ఐటీ, టెలికాం, కంప్యూటర్ విప్లవానికి రాజీవ్ గాంధీ గారే బీజం వేశారని కొనియాడారు రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా మనం ‘సద్భావనా దివస్’ గా జరుపుకుంటున్నామని, దేశంలో శాంతి, ఐక్యత, మతసామరస్యాన్ని పెంపొందించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. రాజీవ్ గాంధీ గారు కేవలం ఒక ప్రధానమంత్రి మాత్రమే కాదని, 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశానికి ఆయన ఆద్యుడు. కేవలం 40 ఏళ్ల చిన్న వయస్సులోనే దేశ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి, భారతదేశాన్ని ఆధునిక అగ్రరాజ్యాల సరసన నిలబెట్టేందుకు రాత్రింబవళ్లు శ్రమించిన వీరుడు ఆయన.

యువత దేశ రాజకీయాల్లో భాగస్వాములు కావాలని 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహోన్నత నాయకుడని, పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలకు అధికారాలను వికేంద్రీకరించి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తుచేశారు. దేశ ఐక్యత, మతసామరస్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుడు రాజీవ్ గాంధీ అని, ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా కట్టుబడి పనిచేయాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారు పిలుపునిచ్చారు
🏠 Home