నాగమయ్య గుడి లైన్‌లో డ్రైనేజీ శుభ్రత పనులు ప్రారంభం*
*తెలంగాణ/వరంగల్,ఆగస్టు 20*
వరంగల్: 41వ డివిజన్ పరిధిలోని నాగమయ్య గుడి లైన్‌లో మున్సిపల్ పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి.కార్పొరేటర్ పోషాల పద్మ,పోషాల స్వామి ఆధ్వర్యంలో డ్రైనేజీ శుభ్రపరిచే పనులను ప్రారంభించారు.ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మురుగు నీరు కాలువలో సాఫీగా వెళ్లేలా జెసిబి తో డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు.డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త,వ్యర్థాలను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు.ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది పనులు చేపడుతున్నట్లు తెలిపారు.