ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి - వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు.
వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్‌తో పాటు రోడ్లు, భవనాలు, మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల అధికారులు, ట్రైసిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు నగరంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల పనితీరు, వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన జంక్షన్లు, ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న రోడ్లపై ఆక్రమణలు, తొలగించాల్సిన టెలిఫోన్ మరియు విద్యుత్ స్తంభాలు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, రోడ్డు మరమ్మతులు, యూ-టర్నింగ్ ప్రాంతాల్లో సోలార్ బ్లింకర్లు ఏర్పాటు, ఆటో స్టాండ్లకు అనువైన ప్రదేశాల గుర్తింపు తదితర అంశాలపై అధికారులు చర్చించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా అధికారులు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ట్రైసిటీ పరిధిలో రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేని 159 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటుకు సంబంధిత అధికారులు చొరవ చూపాలని సూచించారు. అదేవిధంగా ప్రమాదకర ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రోడ్డు మలుపులు, అనధికార పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ అధికారులు సూచించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించడం ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలను మరింత స్పష్టంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు.
సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, హన్మకొండ ఏసీపీ నర్సింరావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణతో పాటు ట్రాఫిక్ విభాగం అధికారులు, ట్రైసిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఐటికోర్, టి టి ఐ ఇన్స్ స్పెక్టర్లు , మున్సిపల్, ఆర్ అండ్ బి పాల్గొన్నారు.