🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 20 Aug, 2026 | Page: 1

ఊకల్ శివారు పెట్రోల్ బంకులో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులు అరెస్ట్

గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని *ఊకల్ గ్రామ* శివారులో, వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది.

*నిందితుల వివరాలు:*

1. *కంది చరణ్*, తండ్రి: సమ్మయ్య, అంబేద్కర్ నగర్, *కాజీపేట*.
2. *జక్కుల ప్రతాప్*, తండ్రి: ప్రసాద్, విష్ణుపురి, *కాజీపేట*.
3. *గండికోట శివ*, తండ్రి: కుమారస్వామి, అంబేద్కర్ నగర్, బాబూజీ నగర్, *కాజీపేట*.

*సంఘటన వివరాలు:*

*తేదీ 18.08.2026 అర్ధరాత్రి, పై ముగ్గురు నిందితులు* ఊకల్ హవేలి గ్రామ శివారులో వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లారు.

అక్కడ విధుల్లో ఉన్న మేనేజర్ కౌడగాని వేణుగోపాల్ ను CNG గ్యాస్ పంపు ఎక్కడ ఉందని అడిగి నట్టు నటించి, రెక్కి నిర్వహించి దొంగతనం చేయడానికి పథకం రచించారు.

అనంతరం, వేణుగోపాల్ రెండు పంపు ఆవరణలో అర్థరాత్రి దాటిన తర్వాత అతను నిద్రిస్తున్న సమయంలో అతని వద్ద ఉన్న బ్యాగులోని ₹15,800/- నగదును దొంగిలించారు అక్కడినుండి వారు వచ్చిన ఆటోలు పారిపోవడం జరిగింది. అనంతరం దొంగిలించిన నగదును ముగ్గురు నిందితులు సమానంగా పంచుకున్నారు. విషయమై పెట్రోల్ పంపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేయడానికి క్రైమ్ సిబ్బందిని ప్రత్యేక గ్రూపులుగా నియమించడం జరిగినది.

*నిందితుల అరెస్ట్:*
నిందితులను అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన క్రైమ్ టీములు
ఈ రోజు మరియాపురం గ్రామ శివారు కెనాల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ఒక ఆటో అనుమానాస్పదంగా పోలీసులకు కనబడగా అట్టి ఆటోను ఆపే ప్రయత్నం చేరగా నిందితులు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేయడం జరిగినది వెంటనే పోలీసువారు అప్రమత్తమై ఆటోను ఆపి తనిఖీ చేయగా అట్టి ఆటోలో ఉన్న పై ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఊకల్ శివారులోని పెట్రోల్ బంకులో జరిగిన దొంగతనం వారే చేసినట్లుగా ఒప్పుకోని వారు దొంగిలించిన డబ్బులను చూపించడం జరిగినది వెంటనే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది.

*స్వాధీనం చేసుకున్న వస్తువులు:*

🔹 ₹11,000/- నగదు
🔹 రెండు మొబైల్ ఫోన్లు
🔹 నేరానికి ఉపయోగించిన ఆటో
దొంగతనం చేసిన నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడమే కాకుండా నిందితులపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది.

ఈ దొంగతనం కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రత్యేకంగా కృషి చేసిన *ఎస్‌ఐ అనిల్ కుమార్*, *పోలీస్ కానిస్టేబుళ్లు* *అరవింద్, విజయ్,* *ప్రవీణ్* మరియు *సాయిలను* గీసుగొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ అభినందించారు.
నిందితులను గుర్తించడం, వారి కదలికలను పసిగట్టడం, వాహన తనిఖీల ద్వారా వారిని అదుపులోకి తీసుకోవడంలో సిబ్బంది చూపిన సమన్వయం మరియు అంకితభావాన్ని ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
🏠 Home