మట్టి, ఇసుక లభ్యత కోసం సులభతర విధానాన్ని రూపొందించాలి
జిల్లాలో విధివిధానాలపై కమిటీ ఏర్పాటు*
*హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి*
*హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా శాండ్ కమిటీ సమావేశం*
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన మట్టి ఇసుక లభ్యత కొరకు సులభతరమైన విధి విధానాలను రూపొందించాలని *హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి* అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో శాండ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఖనిజ వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... జిల్లాలో సులభతరమైన విధానంలో మట్టి (సిల్ట్ ) సరఫరా చేయడానికి, గృహ అవసరాలకు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపయోగపడే విధంగా విధి విధానాలను రూపొందించాలన్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టిని అందుబాటులో ఉంచడానికి కావాల్సిన విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు.
అదేవిధంగా జిల్లాలో అక్రమ ఇసుక, మట్టి రవాణాను నియంత్రించడానికి కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్, రవాణా, రెవెన్యూ,మైనింగ్, భూగర్భ జల శాఖల అధికారులను ఆదేశించారు.
కమిటీ సమావేశంలో మట్టి కి ఒక ఘన పరిమాణానికి రూ. 150 అనగా ఒక ట్రాక్టర్ కు మూడు క్యూబిక్ మీటర్లకు రూ. 450గా నిర్ణయించారు. దీని విధివిధానాలను తయారు చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ (సీజీజీ) సులభతరమైన వెబ్సైట్ రూపొందించడానికి చర్యలు చేపట్టాలన్నారు. పట్టాదారు ఎవరైనా తన భూమిని చదును చేసుకోవాలనుకున్నట్లయితే వారు వెబ్సైట్లో వివరాలు నమోదుచేసి నిరభ్యంతర పత్రం సమర్పించాలన్నారు.
తద్వారా జిల్లాలో మట్టి రవాణా చేస్తున్న వాహనాలన్నీ కూడా అన్ని అనుమతులతో విధిగా సీజిజి పోర్టల్ నందు నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని గ్రామాలలో చెరువుల నుండి సిల్ట్ ( రైతులు తమ పంట పొలాలకు వేసుకోవడానికి ), ఇటుక బట్టీల కోసం వినియోగించే సిల్ట్ ను తీసుకోవడానికి సాగునీటిపారుదల శాఖ నిబంధనల మేరకు అనుమతించాలని తెలిపారు.
గ్రామాలలో గ్రామ పాలన అధికారుల సహకారంతో విధానాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మట్టి, ఇసుక లభ్యత కోసం జిల్లా స్థాయి కమిటీని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా మైనింగ్ శాఖ ఏడీ రామాచారి, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, భూగర్భ జల వనరుల శాఖ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ రవీందర్, టీజీఎండిసి పిఓ వెంకటేశ్వర్లు, సాగునీటి పారుదల శాఖ ఈఈ సునీత, డీఈ రమాకాంత్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏఈ సుభాష్, మైనింగ్ రాయాల్టీ ఇన్స్పెక్టర్ రమేష్, పరకాల డీఏవో విజయశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మధు కుమార్, తదితరులు పాల్గొన్నారు.