నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్
నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలని వరంగల్ పొలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపిఎపి సూచించారు. నేరాల నియంత్రణలో సిసి కెమెరాల ప్రాధాన్యతపై సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్వంలో నగరానికి చెందిన వ్యాపారస్తులకు స్థానిక అంబేద్కర్ భవన్ లో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ప్రధాన రోడ్డు మార్గాల్లో వ్యాపారాలు నిర్వహించుకునే వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గోని వ్యాపారస్తులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ప్రజల భద్రత కల్పించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, అలాగని ఇంతమంది ప్రజలకు వ్యక్తిగత భద్రత కల్పించడం కష్టసాధ్యమని, నేరాల నియంత్రణలో పోలీసులు తమ వంతు కృషి చేస్తూనే వుంటారు. పూర్తి స్థాయిలో నేరాలు జరగకుండా వుండాలంటే ప్రతి ఒక్కరు పోలీసుల మాదిరిగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరిస్తే సమాజంలోని ప్రజలకు భద్రత కల్పించడం సులభమవుతుందని. ఇందులో భాగంగా ప్రతి వ్యాపారస్తుడు తప్పని సరిగా రోడ్డుపై దృష్యాలు కనిపించే విధంగా నాణ్యమైన ఒకటి లేదా రెండు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకొవాల్సిన అవసరం ఎంతైన వుందని. ముఖ్యంగా 30రోజుల బ్యాకఆఫ్ వుండే విధంగా జాగ్రత్త పడాలని, వ్యాపారస్తులు సిసి కెమెరాలు ఎర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పరోక్షంగా భద్రత కల్పించినవారు అవుతారని, నేరాల నియంత్రణలో సిసి కెమెరాల చాలా కీలకంగా పనిచేస్తాయని, నేను సైతం కార్యక్రమము ద్వారా ప్రతి వ్యాపాస్తుడు సిసి కెమెరాల ఎర్పాటు చేసుకోవాలని, సిసి కెమెరాల నిఘాలో వున్నారాని తెలిస్తే నేరస్తులు నేరాల చేసేందుకుగా భయపడుతారని, అలాగే ప్రధాన రోడ్డు మార్గాలపై వ్యాపారం నిర్వహించుకునే వ్యాపాస్తులు రోడ్లపై జరిగే రోడ్డు ప్రమాదాల్లొ క్షతగాత్రులను త్వరితగతిన హస్పటల్ తలించి వారి ప్రాణాలను నిలబెట్టెందుకు కృషి చేసివారికి కేంద్ర ప్రభుత్వం రాహవీర్ పథకంగా ద్వారా కలెక్టర్ చేతుల మీదుగా 25వేల రూపాయల నగదు పురస్కారం అందించబడుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి దారా కవిత, ఎసిపిలు నర్సింగరావు, సత్యనారయణతో పాటు ఇన్స్‌స్పెక్టర్లు,ఎస్.ఐలు వ్యాపారస్తులు పాల్గోన్నారు.
ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి దారా కవిత, ఎసిపిలు నర్సింగరావు, సత్యనారయణతో పాటు ఇన్స్‌స్పెక్టర్లు,ఎస్.ఐలు వ్యాపారస్తులు పాల్గోన్నారు.