🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 21 Aug, 2026 | Page: 1

అక్రమంగా నిల్వ చేసిన 45 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, కేయూసీ పోలీసులతో కలిసి అక్రమంగా నిల్వ చేసిన 45 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హనుమకొండలోని వడ్డేపల్లి, కోమటిపల్లి తండాలోని గుంట జన్నయ్య ఇంటిపై పోలీసులు దాడి చేశారు.
ఈ దాడిలో 90 తెల్ల బస్తాల్లో ఉన్న సుమారు 45 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం, మొత్తం విలువ రూ.1,57,500గా పోలీసులు తెలిపారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడు గుంట జన్నయ్యను తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్‌ జి. బాబులాల్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం, కేయూసీ పోలీసులు పాల్గొన్నారు.
🏠 Home