🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 22 Aug, 2026 | Page: 1

స్వయంకృషికి చిరునామా మెగాస్టార్ చిరంజీవి

సామాన్య కుటుంబంలో పుట్టి,అసామాన్య విజయాలు సాధించిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా నటనపై ఆసక్తితో, స్వయంకృషితో కఠోర శ్రమతో వెండితెరపై తన నటనతో, అదిరిపోయే డ్యాన్సులతో నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఎంతో పోటీ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక పంథా ను ఎంచుకొని తెలుగు సినిమా చరిత్రలో అగ్ర కథానాయకుడిగా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. నటనతోనే కాదు నేత్రదానం,రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రకృతి విపత్తుల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్న చిరంజీవి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్నారు. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ అన్నదానం వంటి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.
🏠 Home