🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 22 Aug, 2026 | Page: 1

స్నేహానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ధర్మారం ఎస్సెస్సీ 93–94 బ్యాచ్‌ మిత్రులు

93–94 బ్యాచ్‌ మానవత్వానికి ఆదర్శం
స్నేహానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ధర్మారం ఎస్సెస్సీ 93–94 బ్యాచ్‌ మిత్రులు
చిన్ననాటి స్నేహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ మిత్రుల్లో ఎవరికి ఆపద వచ్చినా అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ధర్మారం ఎస్సెస్సీ 1993–94 బ్యాచ్‌ మిత్రులు.
తమతో కలిసి చదువుకున్న మిత్రుడు సుగుణాకర్ మృతి చెందడంతో, బ్యాచ్‌ సభ్యులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.అంతేకాకుండా సుగుణాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచి కొనసాగుతున్న స్నేహాన్ని కేవలం జ్ఞాపకాలకే పరిమితం చేయకుండా.. మిత్రుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ తమ స్నేహబంధానికి కొత్త అర్థం చెబుతున్నారు.
మిత్రుడి మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ఎస్సెస్సీ 93–94 బ్యాచ్‌ సభ్యుల సేవాభావాన్ని పలువురు అభినందిస్తున్నారు.
స్నేహం అంటే కలిసి నవ్వుకోవడమే కాదు..
మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు అతని పక్కన నిలబడటం.
ఆ మాటను చేతల్లో చూపిస్తూ.. ధర్మారం ఎస్సెస్సీ 93–94 బ్యాచ్‌ మిత్రులు మానవత్వానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
🏠 Home