🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 22 Aug, 2026 | Page: 1

ఓరుగల్లు వీరత్వానికీ అద్భుతమైన జానపద కళలకు పురిటిగడ్డ, సాంస్కృతిక వైభవానికి ఓరుగల్లు పుట్టినిల్లు..ఈగ మల్లేశం

హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు J B కల్చరల్ ఆర్ట్ సొసైటీ (వరంగల్) ఆధ్వర్యంలో జరుగుతున్న "ఓరుగల్లు జానపదాల స్వరాల ఝల్లు కాకతీయ సకల కళల జాతర" ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం గారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఓరుగల్లు గడ్డ ఘనమైన కళలకు, అద్భుతమైన సంస్కృతికి నిలయం అని మన జానపదాలు, కాకతీయ కళలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి మన జాతి సంపద అని అన్నారు.అంతరించిపోతున్న మన జానపద కళలను, కాకతీయుల వైభవాన్ని కాపాడుకుని, వాటిని భద్రంగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, తెలంగాణ జానపద వైభవాన్ని చాటిచెప్పేలా కళాకారులు ప్రదర్శిస్తున్న నైపుణ్యం అభినందనీయమని ఇలాంటి ఉత్సవాలు ఓరుగల్లు ఘనకీర్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెబుతాయని ఆయన తెలిపారు.

నేటి యువతీ యువకులు చెడు సావాసాలకు బానిసలై క్షణికావేశంలో వారి భవిష్యత్తును అంధకారంలోకి పోతున్న తరుణంలో మన ఇతిహాసాలు కళలు, సాంప్రదాయాలు, సంస్కారం ఈ కళల ద్వారా ఎంతో దోహద పడుతాయని, ముఖ్యంగా తల్లి తండ్రులు పురాణ చరిత్ర గురించి పురాతన కలల గురించి భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ముఖ్యపాత్ర పోషించాలని తెలిపారు.ఇప్పటికీ స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో లిపి లేని కళాకారులు 103 రకాలు ఉన్న వారి జీవనశైలి కళల మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి చేయూతనిచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం J B కల్చరల్ ఆర్ట్ సొసైటీ జడల శివ ఆధ్వర్యంలో మరియు జనగాం రాము వాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డా.హరిప్రయా హరినాథ్, శంకర్ సారంగపాని శిష్యులు సింగర్ శ్యామ్, ప్రసాద్, సురేందర్, ఇమ్మానుయేల్, మున్నా, తోట రవి, రంగనాధ్, చంద్రశేఖర్, బుజంగారావు, శిభ, ch.రోజరాణి, బిక్షపతి, శ్రీకాంత్, మురళి మధు, కాజిపేట ప్రభాకర్, చిరంజీవి, ప్రవీణ్,మామిండ్ల లక్ష్మణ్ , కరిముల సంపత్ రావు, సంపత్ యాదవ్ , రవీందర్ రెడ్డి, జూలూరి శ్రీనివాస్
మరియు వివిధ జిల్లాల నుండి జానపద, ఒగ్గు, చిందు, యాక్షగానం, భగవతల శాస్రియ కళాకారులు పాల్గొన్నారు.
🏠 Home