🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 22 Aug, 2026 | Page: 1

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష రాష్ట్రంలో రోడ్లు, వంతెనల పనుల పురోగతిపై ఆరా

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రోడ్లు భవనాల శాఖపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా CRIF రోడ్ల పనులు, సేతుబంధన్ వర్క్స్, పలు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు సమాచారం.
అదేవిధంగా సచివాలయంలో ఏర్పాటు చేయనున్న సోలార్ పార్కింగ్ అంశంపైనా మంత్రి చర్చించారు. ఇందుకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించి, పార్కింగ్ సదుపాయంతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులతో చర్చించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఈఎన్సీ (అడ్మిన్) లింగారెడ్డి, చీఫ్ ఇంజినీర్లు వసంత్ నాయక్, వనజ, ధర్మారెడ్డి, డీసీఈ అహ్మద్ అబ్దుల్ అలీతో పాటు పలువురు ఎస్‌ఈలు, ఈఈలు, ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.
🏠 Home