🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 22 Aug, 2026 | Page: 1

అబద్ధాలు చెప్పడం,మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట.* *బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ళ కుమారస్వామి*


జన చరిత్ర న్యూస్ వర్ధన్నపేట , ఆగష్టు 22 :k

వర్ధన్నపేట మండల కేంద్రం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలిగిందని,మైక్ లకు పర్మిషన్ లేదని తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నాయకుల పై కేసు పెట్టింది మీ పార్టీ నాయకులు కాదా? పక్కనే భవన నిర్మాణ కార్మికులు , ఆటో యూనియన్ నాయకులు కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది వారిపై లేని కేసులు కేవలం బిఆర్ఎస్ నాయకుల పైన పెట్టడంలో అంతరార్థం ఏంది? అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేవి నీతులు.. చేసేవి చిల్లర రాజకీయాలు.. అని ఎద్దేవా చేశారు. జాతీయ జెండా పండుగ చేస్తే ట్రాఫిక్ అంతరాయం అన్నారు,అదే సెంటర్ లొ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చేసి స్లొగన్స్ ఇచ్చుకుంటూ స్పీచ్ లు ఇస్తుంట్టే ప్రజలకు అంతరాయలు కలగవా? దానికి అనుమతులు అవసరము లేదా?
వాటికి కేసులు ఉండవా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
చట్టం ముందు అందరు సమానులే అయితే మీ మీద కూడా కేసులు అవ్వాలి కదా?
మీకున్న అధికారంతో ఆఫీసర్లను ఒత్తిడి చేసి మాపై
కేసులు పెట్టింది ఇది నిజం కాదా? అని అన్నారు. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కుమాలిన రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పాలన చేతకాకపోతే రాజకీయాలు మానేయాలని.. కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని తుళ్ళ కుమారస్వామి హెచ్చరించారు.
🏠 Home