రౌడీ షీటర్ల వ్యవహర శైలిపై నిరంతరం నిఘా పెట్టాలి
పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల వ్యవహర శైలి పట్ల అధికారులు నిఘా పెట్టాలని వరంగల్ పొలీస్ కమిషనర్ శ్వేత,ఐపిఎస్ అధికారులను అదేశించారు. నెల వారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్వర్యంలో శనివారం కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపిలు, ఏసిపిలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి పోలీస్ అధికారి నిరంతరం శ్రమించాల్సి వుంటుందని,ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని ప్రజలతో సత్ససంబంధాలను కోనసాగించడంతో పాటు, వారి సమస్యలపై తక్షణమే స్పందించడం ద్వారా ప్రజలు పోలీసుల పట్ల స్నేహపూర్వకమైన వాతవరణం నెలకోల్పడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి శాంతి భద్రతల సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చిన వాటిని సులభంగా పరిష్కరించగలమని, ప్రధానం నేరంగా జరిగిన తరువాత చేసే దర్యాప్తు కన్నా నేరం జరగకుండా తీసుకునే ముందస్తూ చర్యలే కీలకమని. ప్రస్తుతం మత్తు పదార్థాల కారణంగా ఎంతో మంది యువత వారి భవిష్యత్తు అంధకారంగా మారుతోందని. ఈ సమస్యన నివారణకు పోలీస్ అధికారులు మత్తు పదార్థాల వినియోగదారుల గుర్తించడం ద్వారా వారితో విక్రయదారులకు కట్టడి చేయడంతో యువతను డ్రగ్స్ నుండి కాపాడుకోగలమని. ప్రతి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ సిబ్బంది నియమించి వారి ద్వారా డ్రగ్స్ వినియోగ దారులు, విక్రయదారుల సమాచారం సేకరించాలని. గతంలో నేరాలకు పాల్పడి ప్రస్తుతం సమాజంలో జీవిస్తూన్న పాత నేరస్తుల కదలికలపై కుడా పోలీసులు కన్నెసి వుంచాలని, సైబర్ నేరగాళ్ల చేతుల్లో ప్రజలు మోసపోకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులు సూచించారు.
అనంతరం పెండింగ్‌లోని కేసులకు సంబంధించి నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో వున్న కేసుల స్థితిగతులు, స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరుపై పోలీస్ కమిషనర్ సంబందిత పొలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్ర నాయక్, కిషన్ సింగ్, అదనపు డిసిపిలు సురేష్‌కుమార్, బాలస్వామితో పాటు ఏసిపిలు ఇతర పోలీస్ అధికారులు పాల్గోన్నారు.