🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 23 Aug, 2026 | Page: 1

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ నూతన భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నాయిని దంపతులు

తేదీ :23/08/2026-ఆదివారం,
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.

హనుమకొండ స్నేహనగర్, ఎన్‌జీవోస్ కాలనీ రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ నూతన భవన ప్రారంభోత్సవ శుభ కార్యక్రమానికి ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు , వారి సతీమణి శ్రీమతి నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో ఐక్యత, సేవా భావాన్ని పెంపొందించడంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, కాలనీవాసులు,మహిళలు పాల్గొన్నారు.
🏠 Home