🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 23 Aug, 2026 | Page: 1

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు.

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
పర్వత గిరి మండల పరిధిలోనీ తుర్కల సోమారం లో స్వేరో నాయకుడు జంగిలి యాకుబ్ కవల పిల్లల ప్రథమ పుట్టినరోజు సందర్భంగా హాజరై మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు ఆశీర్వదించారు. ఆ తదుపరి పర్వత గిరి లో సెలూన్ నిర్వహిస్తున్న గిద్దమారి శేఖర్ తల్లి చనిపోయిన మర్నాడే తండ్రి చనిపోగా శేఖర్ ను కలిసి ధైర్యం చెప్పారు. తదనంతరం వరంగల్ ములుగు రోడ్ సమీపంలోని ARR కన్వెన్షన్ లో చౌటపల్లి ప్యాక్స్ డైరెక్టర్ మట్టపల్లి గోపాల్ రావు మనుమరాలు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు . రాములు వెంట మాజీ జడ్పీటీసీ లునావత్ పంతులు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మహమ్మద్ సర్వర్, సిoగారపు రమేశ్, డా శ్రీనివాస్, జంగా సాంబయ్య, వంశీ రావు, వెంకట్రామ్, మాజీ పాక్స్ చైర్మన్ సాయిలు, బొట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు
🏠 Home