🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 23 Aug, 2026 | Page: 1

*సౌత్ జోన్ ఫారాత్రో బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పథకాన్ని సాధించిన పోకల రమాదేవి

*జన చరిత్ర న్యూస్,పర్వతగిరి*
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో జరిగిన సౌత్ జోన్ ఫారాత్రో బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొనగా, రమాదేవి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పథకాన్ని సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన పోకల రమాదేవి పుట్టుకతో వచ్చిన వైకల్యం తన లక్ష్యానికి అడ్డంకి కాదని, తన వైకల్యాన్ని అధిగమించి, నిరంతర సాధన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఈనెల 22న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన 5వ సౌత్ జోన్ ఫారాత్రో బాల్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకాన్ని సాధించారు. సాధారణ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులతో పాటు, సమాజంలో అంగవైకల్యంపై ఉండే అపోహాలను, పరిమితులను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. క్రీడలపై ఆసక్తిని పెంచుకున్న పోకల రమాదేవి పారత్రో బాల్ లో క్రమం తప్పకుండా సాధన చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. ఈ సందర్భంగా బంగారు పథకాన్ని సాధించిన రమాదేవిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించాలని కోరారు.
🏠 Home