🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 23 Aug, 2026 | Page: 1

బాలసముద్రంలోని శ్రీలక్ష్మి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌ ప్రారంభం

బాలసముద్రంలోని శ్రీలక్ష్మి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశ్రీక్ అడ్వాన్స్‌డ్ లివర్ గ్యాస్ట్రో సెంటర్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఎంతోకాలంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న శ్రీలక్ష్మి హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ నూతన లివర్ గ్యాస్ట్రో సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్యుల సేవలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.

లివర్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే ఈ సెంటర్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా నూతన అడ్వాన్స్‌డ్ లివర్ గ్యాస్ట్రో సెంటర్ డా శ్రీ లక్ష్మి,డా శశ్రీక్ లను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home