సింగర్ కరుణాకర్‌కు “జానపద బ్రహ్మ” అవార్డు
వరంగల్: వరంగల్ నగర పరిధిలోని దూపకుంటకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు ఆకులపెల్లి కరుణాకర్కు ప్రతిష్టాత్మకమైన “జానపద బ్రహ్మ” అవార్డు లభించింది.
గత 35 సంవత్సరాలుగా జానపద కళారంగంలో కొనసాగుతున్న కరుణాకర్ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. తన కళా ప్రదర్శనల ద్వారా ఎంతో మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తూ జానపద కళల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన జాతీయ స్థాయి బెస్ట్ సింగర్, బెస్ట్ యువజన అవార్డు, తెలంగాణ బెస్ట్ సింగర్ అవార్డు వంటి పలు పురస్కారాలను అందుకున్నారు.
ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, సకల కళా సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కరుణాకర్‌కు “జానపద బ్రహ్మ” అవార్డును అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాధం పద్మజ, గడ్డం సుధాకర్, జిల్లా కళాకారులు తమ్మేర వెంకట్, సుదర్శన్, ఇమ్మానియేల్, చంద్రశేఖర్, మత్తోజ్ రవిరాజు, రజిత రెడ్డి, పల్లె కుమార్, డీఎస్ నందు, కన్నయ్య, రజిత, స్వప్న, కీర్తి, రాధిక, పరమేశ్వరి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
కరుణాకర్‌కు “జానపద బ్రహ్మ” అవార్డు లభించడంపై జిల్లా కళాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.