తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల సేవలు నిలిచిపోనున్నాయి. 18 సంఘాలతో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆటో, క్యాబ్ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అలాగే ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించాలని, గిగ్ వర్కర్ల కోసం అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని కూడా జేఏసీ కోరుతోంది.
తమ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని ఆటో, క్యాబ్ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. బంద్ నేపథ్యంలో ప్రయాణికులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.