🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 24 Aug, 2026 | Page: 1

రైల్వే ప్లాట్‌ఫాంపై దొరికిన మొబైల్‌ను యజమానికి అప్పగించిన GRP, RPF పోలీసులు

22-08-2026 సాయంత్రం సికింద్రాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 4కు వచ్చిన సాగర్ సింగ్ ధ్రువే, తండ్రి సాహబ్ సింగ్, నివాసం బాలాఘాట్, మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి తన రెడ్‌మీ మొబైల్ ఫోన్‌ను ప్లాట్‌ఫాంపై మరచిపోయాడు.విధుల్లో ఉన్న GRP, RPF పోలీసు సిబ్బంది ఆ మొబైల్ ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం IRP వరంగల్ వి. నరేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఫోన్ యజమాని వివరాలను సేకరించి, అతడిని సంప్రదించారు.
ఈ క్రమంలో 23-08-2026న సదరు మొబైల్ ఫోన్‌ను దాని అసలు యజమాని సాగర్ సింగ్ ధ్రువేకు పోలీసు సిబ్బంది అప్పగించారు.ప్రయాణికుడి మరిచిపోయిన మొబైల్‌ను భద్రంగా స్వాధీనం చేసుకుని, వివరాలు సేకరించి యజమానికి తిరిగి అప్పగించిన GRP, RPF సిబ్బంది సేవాభావం మరియు బాధ్యతాయుతమైన విధి నిర్వహణపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
🏠 Home