చింతల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం.. 30 ఏళ్ల యువకుడు మృతి
వరంగల్, ఆగస్టు 24 వరంగల్ శివనగర్–చింతల్ బ్రిడ్జి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్ల లొల్లటి క్రాంతి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తన తండ్రి చికిత్స నిమిత్తం సంరక్ష ఆసుపత్రికి వెళ్తున్న క్రాంతి, ద్విచక్ర వాహనంపై శివనగర్ నుంచి చింతల్ బ్రిడ్జి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం అతని బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో క్రాంతికి తీవ్ర గాయాలు కావడంతో పాటు అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే అతడిని రోహిణి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ క్రాంతి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.క్రాంతికి భార్య సింధుతో పాటు మూడేళ్ల చిన్నారి కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న క్రాంతి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
చింతల్ బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు.. చర్యలు ఎప్పుడు?
చింతల్ బ్రిడ్జి ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న సమస్యలను అధికారులు గుర్తించి, రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా బ్రిడ్జి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు పోలీసులు, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.