🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 25 Aug, 2026 | Page: 1

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు బీజేపీ దీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” రెండు రోజుల నిరాహార దీక్షకు బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు సంఘీభావం తెలిపారు.
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించాలని కోరారు.
“ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.
🏠 Home