మోత్కుర్: విజేతలకు నగదు పునస్కారాలు
మొత్కూర్ శాఖ గ్రంథాలయంలో మే 11 నుంచి జూన్ 11 వరకు నిర్వహించిన 'డే విత్ లైబ్రరీ` కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నగదు పునస్కారాలు. మెమోంటోలు అందజేశారు.ముఖ్య అతిథి డాక్టర్ గుర్రం లక్ష్మీ నర్సింహరెడ్డి మాట్లాడుతూ.... పుస్తక పఠనం విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత పెంపొందిస్తుందని అన్నారు. గ్రంథాలయం చైర్మన్ కొమ్మటి మత్స్యగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న దాతలు పాల్గొన్నారు.