🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 26 Aug, 2026 | Page: 1

ప్రజా హక్కుల సాధన సమితి రాష్ట కమిటీ ఎన్నిక

ఈ రోజు నల్గొండ పట్టణం లో ప్రజా హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటి ఎన్నిక ప్రజా హక్కుల సాధన సమితి రాష్ట కార్యాలయం నల్గొండ లో నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో ప్రజా హక్కుల సాధన సమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గా మాజీ సర్పంచ్ పల్లెబోయిన నాగార్జున యాదవ్ గారిని మరియు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కలకుంట్ల వినోద్ చారి గారిని మరియు రాష్ట్ర కార్యదర్శి గా,బొజ్జ ధనుంజయ గారిని ఎన్నుకోవడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ మా యొక్క ఎన్నికకు సహరించిన ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
🏠 Home