🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 26 Aug, 2026 | Page: 1

గ్రామంలో నీటి సమస్యలను పరిష్కరించిన గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్

జన చరిత్ర వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించడం కోసం గ్రామంలో నాలుగు ప్రధాన మోటార్లను మరమ్మత్తులు చేయడం జరిగింది గ్రామంలో ప్రస్తుత విద్యుత్ సమయపాలన మారడం వలన గ్రామంలో నీటి సరఫరా లో అంతరాయం ఏర్పడిన వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ గ్రామ నల్లాల బావిలో అదనంగా కొత్త మోటారు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా గ్రామ స్మశాన వాటికలో మరమ్మత్తులో ఉన్నటువంటి నూతన మోటర్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామంలోని అలుగులవాడలో మోటర్ రిపేర్ చేసి సైఫన్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ తెలిపారు.
🏠 Home