మహమ్మద్ ప్రవక్త బోధనలు సమాజానికి శాంతి, సోదరభావానికి మార్గదర్శకం: డీసీసీ అధ్యక్షుడు అయూబ్
*మిలాద్ - ఉన్- నబీ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,డీసీసీ అధ్యక్షుడు అయూబ్ ..*
మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని *వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్* అన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఉర్సు దర్గా, శాంతినగర్, మండిబజార్, ఎల్‌బీ నగర్ దర్గా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య తో కలిసి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు కీర్, స్వీట్ పంపిణీ చేశారు.
*ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అయూబ్ మాట్లాడుతూ…*
మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవతా విలువలను బోధించారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, కులమత సామరస్యాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.
కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యంగా జీవించడమే ప్రవక్త మహమ్మద్ బోధనల సారాంశమని పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం ప్రజలందరిలో ప్రేమ, సోదరభావం, మానవతా దృక్పథాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.
ప్రవక్త మహమ్మద్ బోధించిన విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. మత సామరస్యానికి వరంగల్ జిల్లా ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా వరంగల్ జిల్లా ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మహమ్మద్ అయూబ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, అల్తాఫ్, కాంగ్రెస్ నాయకులు బస్వరాజు కుమార్, శ్రీమాన్, నల్గొండ రమేష్, గోరంట్ల రాజు, మహమ్మద్ పాషా, కమాలుద్దీన్, యాదగిరి, సతీష్, మొహమ్మద్ జానీ, పులిచేరి రాధాకృష్ణ, ముచ్చర్ల స్టాలిన్, రాకేష్, భూపాల్, సుధీర్ తో ముస్లిం సోదరులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు….