🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 27 Aug, 2026 | Page: 1

గంగపుత్ర మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలి

టిజిఎస్ రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర

ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకంలో గంగపుత్ర మహిళలకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన తెలంగాణ గంగపుత్ర సంఘం గ్రేటర్ వరంగల్ మహిళా అధ్యక్షురాలు పొక్కుల సరోజన గంగపుత్ర వారి కార్యవర్గ సభ్యులు జిజుల సునీత, పిల్లి శ్రీలత, తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర అభినందించారు

గంగపుత్ర మహిళల ఆర్థిక స్వావలంబన ఉపాధి అవకాశాల కోసం సరోజన గంగపుత్ర చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన గంగపుత్ర మహిళలకు అందేలా సంఘం తరఫున నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.గంగపుత్ర మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్లలో తగిన ప్రాధాన్యత కల్పించి వారి జీవనోపాధికి ప్రభుత్వం సహకరించాలని టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర కోరారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన పొక్కుల సరోజన గంగపుత్ర మరియు వారి కార్యవర్గానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు
🏠 Home