🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 27 Aug, 2026 | Page: 1

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాలను, ప్రత్యేక గ్రామ సభను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు

హనుమకొండ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాలను, ప్రత్యేక గ్రామ సభను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 49వ డివిజన్‌లో రామాలయం, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్డు సభలు, ఓటరు నమోదు, సవరణ కేంద్రాలను ఆయన సందర్శించారు. బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన ప్రక్రియను పరిశీలించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
అనంతరం ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరయ్యారు. ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, అభ్యంతరాలపై గ్రామస్తులతో చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, మరణించిన వారి, డూప్లికేట్ ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించాలని కలెక్టర్, రెవెన్యూ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమాల్లో 49వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగపురి కిరణ్, మాజీ కార్పొరేటర్ రామ్ ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home